దేశ భాషలందు తెలుగు లెస్స
తెలుగదేల యన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ తెలుగొకండ
నెల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి
దేశ భాషలందు తెలుగు లెస్స
విజయనగర సామ్రాజ్యాధీశ, ఆంధ్ర భోజ, సాహితీ సమరాంగణ సార్వభౌమ శ్రీ కృష్ణదేవ రాయలచే రచింపబడ్డ ఈ పద్యం ఆయనకు తెలుగు భాష మీద ఉన్న అభిమానాన్ని మనకు తెలియపరుస్తుంది. ఆముక్త మాల్యద అష్ట దిగ్గజాలు మొదలైన వాటి గురించి నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు.
